కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన: 10,000 బ్రహెయినీ దినార్ల జరీమానా

- December 30, 2020 , by Maagulf
కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన: 10,000 బ్రహెయినీ దినార్ల జరీమానా

బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం మరియు ఎగ్జిబిషన్స్ అథారిటీ (బిటిఇఎ), పర్యాటక కేంద్రాల్లో (హోటళ్ళు అలాగే రెస్టారెంట్లలో కూడా) కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరి చేసిన ముందస్తు జాగ్రత్త చర్యలు, అలాగే నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సూచనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. మినిస్టీరియల్ ఆర్డర్ నెంబర్ 68 - 2020 ప్రకారం రెస్టారెట్లు, కేఫ్ లు కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలు తప్పక పాటించాల్సి వుంటుంది. లేని పక్షంలో భారీ జరీమానాలు విధించే అవకాశం వుంది. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడితే 10,000 దిర్హాముల జరీమానా విధించే అవకాశం వుంటుందని సంబంధిత అథారిటీస్ హెచ్చరించడం జరిగింది. టేబుల్ సీటింగ్ విషయానికొస్తే, 50 శాతం మాత్రమే ఓ టేబుల్ మీద కేవలం ఆరుగురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఇక్కడా 50 శాతం సామర్థ్యం నిబంధన పాటించక తప్పదు. అత్యధికంగా ఆరుగుర్ని మాత్రమే ఓ టేబుల్ వద్ద అనుమతించాల్సి వుంటుంది. ఇండోర్ ఫెసిలిటీస్ విషయానికస్తే, 30 శాతం మంది మాత్రమే అత్యధికంగా వుండాల్సి వస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com