లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు

- December 30, 2020 , by Maagulf
లోన్ పేమెంట్లపై ఊరట: మరో ఆరు నెలలపాటు పౌరులకు వెసులుబాటు

బహ్రెయిన్: కరోనా వైరస్ నేపథ్యంలో లోన్ చెల్లింపులకు సంబంధించి పౌరులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రహెయిన్ ఊరటనిచ్చింది. మరో ఆరు నెలలపాటు ఈ ఉపశమనాన్ని పొడిగిస్తున్నట్లు బహ్రెయిన్ బ్యాంక్స్ అసోసియేషన్ తో సమావేశం అనంతరం సిబిబి ఓ సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ ఎకానమీకి ఊతమిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ వెసులుబాటు క్రెడిట్ కార్డు డ్యూలకు వర్తించదు. అలాగే, బ్యాంకులు వినియోగదారులతో చేసుకున్న టెర్మ్స్ అండ్ కండిషన్లకు లోబడి ఈ వెసులుబాట్లు కల్పిస్తారు. వినియోగదారుల నుంచి వసూలు చేసే ఛార్జీలు, వడ్డీ వంటి వాటిపై అవగాహన కల్పించాలని కూడా సిబిబి, బ్యాంకులకు సూచించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com