సౌదీ సరిహద్దులు తెరుచుకున్నాయి...అయితే ఇవి పాటించాల్సిందే!

- January 03, 2021 , by Maagulf
సౌదీ సరిహద్దులు తెరుచుకున్నాయి...అయితే ఇవి పాటించాల్సిందే!

సౌదీ: కొత్త కరోనావైరస్ సృష్టించిన భయంతో రెండు వారాల పాటు దేశ సరిహద్దులను మూసివేసిన సౌదీ, నేటి నుండి ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ భూమి, సముద్రం, వాయు సరిహద్దులను తెరుస్తున్నట్టు తెలిపింది. అయితే, కొత్త కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న దేశాల నుండి (యుకె, దక్షిణాఫ్రికా) వచ్చే ప్రజలను దేశంలోకి ప్రవేశించే ముందు కనీసం 14 రోజులు ఇతర దేశాలలో గడిపిన తర్వాత మాత్రమే సౌదీ లోకి ప్రవేశించాలి అని అనటంతోపాటు మరికొన్ని ఆంక్షలు విధించింది అధికార మంత్రిత్వ శాఖ.

యుకె, దక్షిణాఫ్రికా నుండి వచ్చే వారు పాటించాల్సిన నియమాలు
* ప్రవాసీయులు: దేశంలోకి ప్రవేశించే ముందు కనీసం 14 రోజులు ఇతర దేశాలలో గడిపిన తర్వాత సౌదిలోకి ప్రవేశించేముందు సదరు వ్యక్తి (పిసిఆర్) పరీక్ష చేయించుకొని కోవిద్ నెగటివ్ వచ్చిన రిపోర్ట్ ను పొందుపరచాల్సి ఉంటుంది.
* సౌదీ పౌరులు: అత్యవసరంగా దేశంలోకి ప్రవేశించదలచుకున్నవారు 14 రోజుల పాటు గృహనిర్బంధం అవ్వవలసి ఉంటుంది. మరియు దేశానికి వచ్చిన 48 గంటలలోపు మొదటి పిసిఆర్ పరీక్ష చేయించుకోవాలి; రెండవది 13 వ రోజు క్వారంటైన్ ముగించే ముందు చేయించుకోవాలి.
* మిగతా ఇతర దేశాల నుండి వచ్చే ఎవ్వరికైనా, ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు వర్తింపజేయబడతాయి. అనగా పిసిఆర్ టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ అయ్యిఉండాలి, కనీసం 3 రోజుల నుండి 7 రోజుల వరకు గృహ నిర్బంధం తప్పనిసరిగా పాటించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com