యూఏఈ పబ్లిక్ స్కూళ్ళకు పరీక్షల షెడ్యూల్ ప్రకటన

- January 05, 2021 , by Maagulf
యూఏఈ పబ్లిక్ స్కూళ్ళకు పరీక్షల షెడ్యూల్ ప్రకటన

యూఏఈ:యూఏఈలోని పబ్లిక్ స్కూళ్ళకు స్టార్ట్-అప్ పరీక్షలు జనవరి 10 నుంచి మొదలవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ సోమవారం వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం ప్రకటించింది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. జనవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 4 నుంచి 11 గ్రేడ్స్‌కి చెందిన విద్యార్థులు తమ పరీక్షల్ని రిమోట్ విధానంలో పూర్తిచేసుకోనున్నారు. 12వ గ్రేడ్ విద్యార్థులకు మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో స్కూళ్ళు అలాగే గత టెర్మ్ పరీక్షలు నిర్వహించిన కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

-సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com