యూఏఈ:ఒమాన్ తో పాటు గ్రీన్ లిస్ట్ దేశాల నుంచి వచ్చే వారికి నో క్వారంటైన్
- January 05, 2021
మస్కట్:ఒమాన్ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులు ఇకపై క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం లేదని యూఏఈ స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో వైరస్ తీవ్రత, వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకుంటున్న చర్యల ఆధారంగా యూఏఈ గ్రీన్ లిస్ట్ దేశాల జాబితా సిద్ధం చేసుకుంది. గ్రీన్ లిస్టులో ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ నిబంధనలు వర్తించవని వెల్లడించింది. యూఏఈ అప్ డేట్ చేసిన గ్రీన్ లిస్ట్ దేశాల జాబితాలో ఒమాన్, కువైట్ తో పాటు సౌదీ అరేబియా ఉన్నాయి. అలాగే బ్రూనై, చైనా, హాంకాంగ్, ఐల్ ఆఫ్ మ్యాన్, మకావు, మారిషస్, మంగోలియా, సెయింట్ కిట్స్ , నెవిస్, న్యూ కాలెడోనియా, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ సావో టోమ్ అండ్ ప్రిన్సిపీ, తైపీ, థాయిలాండ్ ను కూడా గ్రీన్ లిస్టులో చేర్చింది యూఏఈ. మారుతున్న పరిణామాలు, వైరస్ తీవ్రతను బట్టి ఈ జాబితాలో సవరణలు చేస్తామని యూఏఈ యంత్రాంగం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!