ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్

- January 05, 2021 , by Maagulf
ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్

మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒకే కుటుంబానికి చెందిన 31 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 14 ఏళ్ళ చిన్నారులు కూడా వున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ విషయం వెల్లడయ్యింది. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ సూచించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటివి సంభవిస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం ద్వారా, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమనీ, ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న జాగ్రత్త చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలనీ మినిస్ట్రీ హెచ్చరించింది. తక్కువమందితో గేదరింగ్, అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్‌కి దూరంగా వుండవచ్చని మినిస్ట్రీ పౌరులకు, నివాసితులకు సూచిస్తోంది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com