వెయిట్ తగ్గడానికి జామ!

- February 22, 2016 , by Maagulf
వెయిట్ తగ్గడానికి జామ!

వింటర్ సీజన్ వచ్చిందంటేచాలు జామపళ్లు నోరూరిస్తుంటాయి. లొట్టలేసుకుని తినేందుకు చాలామంది ఇష్టపడతారు. ఆకలితోవున్నవారు జామపళ్లు తింటే భోజనం చేసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో పోషక విలువలు ఎక్కువగా వుండటమే దీనికి కారణం. దేశీయంగానే రకరకాల జామపళ్లు కనిపిస్తున్నాయి. ఇక జామి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీకావు. లేటెస్ట్‌గా వెయిట్ తగ్గడానికి జామ ఉపయోగపడుతుందని చెబుతున్నారు పరిశోధకులు. సోడియం, పొటాషియం, ఫైబర్ ఇందులో ఎక్కువగానే ఉంటుంది. షుగర్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుందట. అలాగే బాడీలోని అవసరంలేని ఫ్యాట్‌ను కరిగించడానికి జామ బెస్ట్ మెడిసన్ అని చెబుతున్నారు రీసెర్చర్స్. ఒబేసిటీతో బాధపడేవారు ఆహారంతోపాటు ఓ జామకాయను తీసుకుంటే మంచి రిజల్ట్ వస్తుందట.కొవ్వును ప్రభావితం చేసే పెక్టిన్ జామలో విస్తారంగా వుంటుందని, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుందని అంటున్నారు. జామలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి పరిష్కారం.ఇక ప్రెగ్నెంట్ వుమెన్‌లో వ్యాధి నిరోధకశక్తిని పెంచేందుకు ఇదో దివ్యఔషధం. ఆరంజ్‌లో కంటే జామలో విటమిన్ సి అధికంగా ఉంటోందని, దీనివల్ల కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇందులో పోషకాల వల్ల శరీరం అందంగా ఉంటుంది. జామపండు గుజ్జు ముఖానికి పట్టించడం వల్ల ముడతలు తగ్గి చర్మం మాంచి షైనింగ్‌గా తయారవుతుందట. సో.. మనం కూడా ఓ పట్టు పట్టేద్దామా!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com