మస్కట్: యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ బ్యాగ్ లపై స్పష్టత ఇచ్చిన ఒమన్
- January 08, 2021
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాక్ లకు ప్రత్యామ్నాయంగా వాడాల్సిన బ్యాగులపై ఒమన్ పర్యావరణ అధికార విభాగం స్పష్టత ఇచ్చింది. ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులపై జనవరి 1 నుంచి ఒమన్ లో నిషేధం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే..వాటి స్థానంలో ఎలాంటి బ్యాగులను వినియోగించాలనేది మాత్రం చాలా మందిలో అయోమయం నెలకొని ఉంది. చివరికి కూరగాయలు, మాంసం ఉత్పత్తులకు ఎలాంటి బ్యాగులను వాడాలనేది కూడా ప్రజల నుంచి సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే..పలు వర్గాల నుంచి వస్తున్న సందేహాలపై స్పందించిన పర్యావరణ విభాగం అధికారులు..సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బదులుగా పేపర్, కార్టన్, కాటన్ బ్యాగులు, నాన్ వోవెన్ బ్యాగులను వినియోగించాలని స్పష్టం చేసింది. కొన్ని ప్లాస్టిక్ బ్యాగులు భూమిలో తొందరగా కలిసిపోయినా..వాటి రసయానాలు మాత్రం అలాగే మిగిలిపోతాయని..వాటితో పర్యావరణానికి ముప్పు ఉంటుందని ఎన్విరాన్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామని..ఇందులో భాగంగా తొలిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులపై బ్యాన్ విధించినట్లు స్పష్టం చేసింది. అయితే..చెత్త తరలించే బ్యాగులు, నర్సరీలలో మొక్కలు పెంచే ప్లాస్టిక్ బ్యాగులు, వ్యవసాయం విత్తనాలు మొలకెత్తించేందుకు వాడే బ్యాగులు, పండ్లు, కూరగాయాలు, మాంసం వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే ప్లాస్టిక బ్యాగులపై ప్రస్తుతానికి నిషేధం విధించలేదని... ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన తర్వాత వాటిపై కూడా తగిన నిర్ణయం తీసుకుంటామని పర్యవరణ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!