రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి

- January 11, 2021 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి

మస్కట్: ఇద్దరు భారత వలసదారులు, సమయిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జబల్ షామ్స్ నుండి వీరంతా మస్కట్‌కి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యుమినిగా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది, బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి తామంతా అండగా వుంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com