ట్రంప్ తలరాత మార్చేసిన తెలుగమ్మాయి
- January 11, 2021
అమెరికా:అమెరికాలోని క్యాపిటోల్ భవనంలో హింసాత్మక ఘటనల పట్ల ట్రంప్ వ్యవహరించిన తీరుకు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆ సంస్థ ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై పూర్తిగా నిషేధం విధించింది. ఇక ఈ నిర్ణయాన్ని 45 ఏళ్ల భారత సంతతి మహిళ, ట్విట్టర్ టాప్ లాయర్ విజయ గద్దె తీసుకున్నారని తెలుస్తోంది.
గత శుక్రవారం, మొదటిసారిగా ట్రంప్ ట్విట్టర్ ఖాతా శాశ్వతంగా బ్లాక్ అయింది. కొన్ని రోజులుగా ఆయన చేసే ట్వీట్లను ట్విట్టర్ యాజమాన్యం క్షుణ్ణంగా పరిశీలించింది. అవన్నీ కూడా ఉద్రిక్తతలకు ప్రేరేపించేలా ఉండటంతో.. పరిస్థితులు చేయి దాటకముందే ఆయన ఖాతాను ట్విట్టర్ యాజమాన్యం పూర్తిగా నిషేధించింది.
ఈ నిర్ణయంపై లీగల్, పాలసీ, ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇష్యూస్‌కు హెడ్‌గా వ్యవహరిస్తున్న విజయ గద్దె ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ” డొనాల్డ్ ట్రంప్ చేసే ట్వీట్లు మరింత హింసకు ప్రేరేపించే ప్రమాదం ఉండటం వల్లే ఆయన ఖాతాను నిలిపివేశాం. మేము మా విధివిధానాల అమలు విశ్లేషణ కూడా ప్రచురించాం. మీరు మా నిర్ణయంపై మరింత లోతుగా తెలుసుకోవచ్చు” అని ఆమె పేర్కొన్నారు.
చిన్నతనంలోనే భారతదేశం నుంచి అమెరికాకు వచ్చేసిన విజయ గద్దె.. న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. మొదట్లో పలు స్టార్టప్ కంపెనీలలో పని చేసి 2011వ సంవత్సరంలో ట్విట్టర్ సంస్థలో కార్పోరేట్ లాయర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత దశాబ్ద కాలంలో ట్విట్టర్ మరింత స్థాయికి చేరుకోవడంలో ఆమె ప్రభావం చాలానే ఉందని చెప్పాలి.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







