రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారత వలసదారుల మృతి
- January 11, 2021
మస్కట్: ఇద్దరు భారత వలసదారులు, సమయిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. జబల్ షామ్స్ నుండి వీరంతా మస్కట్కి వస్తుండగా, వీరు ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఇండియన్ స్కూల్ మస్కట్ అల్యుమినిగా బాధితుల్ని గుర్తించారు. ఈ ఘటన తమకు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందనీ, బాధిత కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ఇండియన్ స్కూల్ మస్కట్ సిబ్బంది, బాధితుల సహచరులు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకి తామంతా అండగా వుంటామని ఈ సందర్భంగా ఐఎస్ఎం విద్యార్థులు చెప్పారు. తమ స్నేహితులతో గడిపిన కాలాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని వారు వివరించారు. ఇది అత్యంత విషాదకర ఘటన అని వారు వాపోయారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!