చేతులెత్తేసిన అమెరికా ఉపాధ్యక్షుడు..
- January 13, 2021
వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్‌పై దాడికి కారణమైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అర్ధాంతరంగా పదవీచ్యుతుడిని చేయడం కోసం 25వ రాజ్యంగ సవరణను ప్రవేశపెట్టడంపై ఇటు ప్రతినిధులు సభలో, అటు సెనేట్‌లో డిబేట్ నడుస్తున్నది. మరోవైపు ట్రంప్‌కు ఉద్వాసన పలుకడానికి 25వ సవరణను ప్రవేశపెట్టాలంటూ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పై కూడా డెమోక్రాట్‌లు ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్ పెన్స్ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు.
అధ్యక్షుడికి ఉద్వాసన పలకడానికి 25వ సవరణను ప్రవేశపెట్టాలన్న డెమోక్రాట్ల విజ్ఞప్తిని తాను తోసిపుచ్చుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలం కేవలం 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు, డెమోక్రాట్‌లు 25వ సవరణను ప్రవేశపెట్టాలంటూ నన్ను, క్యాబినెట్‌ను డిమాండ్ చేస్తున్నారు. కానీ అలా చేయడం మన దేశ ప్రయోజనాలకు మంచిది కాదని నేను భావిస్తున్నాను అని ఆ లేఖలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!