కువైట్:ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్..భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

- January 14, 2021 , by Maagulf
కువైట్:ఎంబసీ పేరుతో ఫేక్ కాల్స్..భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

కువైట్ సిటీ:ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న ఆర్ధిక మోసాలపై కువైట్ లోని ఎంబసీ అధికార కార్యాలయం..ఇండియన్ కమ్యూనిటీ అప్రమత్తం చేసింది. కొందరు నేరగాళ్లు ఎంబసీ అధికారులమని చెప్పి కువైట్లోని భారతీయులను నమ్మిస్తున్నారని, ఆ తర్వాత వివరాల అప్ డేట్ ఫీజులు, ఇతర కారణాలు చెప్పి డబ్బు పింపించాలని అడుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అధికారులు వివరించారు. ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లు ప్రధానంగా భారతీయ సమాజాన్నే లక్ష్యంగా చేసుకుందని హెచ్చరించారు. ఎంబసీ కార్యాలయ అధికారులు అనవసరంగా ఫోన్ చేయరనే విషయాన్ని కువైట్ లోని భారతీయులు గమనించాలని కోరారు. అంతేకాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగతంగా ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాలని అడిగరని గుర్తుంచుకోవాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు వివరాలను కూడా ఎంబసీ అడగబోదని తెలిపారు. అందువల్ల ఎంబసీ పేరుతో ఎవరైనా ఫోన్ చేసి నగదు బదిలీ చేయాలని కోరినా, బ్యాంకు, క్రెడిట్ కార్డు వివరాలను
అడిగినా ఇవ్వొద్దని సూచించారు. అంతేకాదు..ఎంబసీ అందిస్తున్న సేవల పట్ల అవగాహన లేకుంటే http://www.indembkwt.gov.in/వెబ్ సైట్ ద్వారా వివరాలు తెల్సుకోవచ్చని వెల్లడించింది. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు కోరినా, బ్యాంకు ఖతా, క్రెడిట్ కార్డు వివరాలు అడిగినా వెంటనే [email protected] కి ఫిర్యాదు చేయాలన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com