ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ నేటితో ముగింపు

- January 15, 2021 , by Maagulf
ట్రాఫిక్ జరీమానాలపై 50 శాతం డిస్కౌంట్ నేటితో ముగింపు

యూఏఈ:యూఏఈలో పలు ఎమిరేట్లు, 50 శాతం డిస్కౌంటుని ట్రాఫిక్ జరీమానాలకు సంబంధించి విధించడం జరిగింది. నేషనల్ డే సందర్భంగా ఈ తగ్గింపు ప్రకటన చేశారు. ఈ గడువు జనవరి 15 (నేటితో) ముగియనుంది. డిసెంబర్ 30తో గడువు ముగుస్తుందని తొలుత అజ్మన్ పోలీస్ ప్రకటించగా, దాన్ని జనవరి 15వ రకు పొడిగించారు. నవంబర్ 23వ తేదీకి ముందు నమోదయిన జరీమానాలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అనుమతి లేకుండా వాహనాల్లో మార్పులు, కోవిడ్ 19 ప్రికాషనరీ మెజర్స్ ఉల్లంఘన వంటివాటికి డిస్కౌంట్ వర్తించదు. ఫుజారియాలోనూ జనవరి 15తో గడువు ముగుస్తుంది. డిసెంబర్ 1కి ముందు ఉల్లంఘనలకు ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. బ్లాక్ పాయింట్లు కూడా రద్దు చేయబడతాయి, పెనాల్టీలను కూడా వెయివ్ చేస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com