’18 పేజెస్’ కీలక షెడ్యూల్ ప్రారంభం...
- January 18, 2021హైదరాబాద్:శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమా ద్వారా హీరో నిఖిల్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన కార్తికేయ, అర్జున్ సురవరం లాంటి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తాజాగా నిఖిల్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థల ఆధ్వర్యంలో ’18 పేజెస్’ మూవీ చేస్తున్నాడు.
ఈ సినిమా కీలక షెడ్యూల్ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో వేసిన సెట్లో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్ల పై కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకున్న సంగతి తెలిసిందే. అన్నట్టు ఈ చిత్రం కూడా వైవిధ్యంగా ఉంటుందని హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని ఇప్పటికే రూమర్స్ వినిపించాయి. అయితే ఈ మెమరీ లాస్ కంటే కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో నిఖిల్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడని సమాచారం. ఈ సినిమా థీమ్ కూడా డిఫరెంట్ పాయింట్ తో ఉండబోతుందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్‌లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్‌ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?