'తాండవ్' పై పోలీస్ కంప్లైంట్ పెట్టిన అధికార పార్టీ
- January 18, 2021
తాండవ్ హిందూ దేవుళ్లను, దేవతలను అవమానించినట్లుగా ఉందంటూ పోలీస్ కంప్లైంట్ చేశారు. ముంబైలో అధికార పార్టీ కంపెనీ ఆఫీస్ వద్ద ఆందోళనకు దిగింది. అదే సమయంలో వెబ్ సిరీస్ లో మళ్లీ హిందూ దేవతలు, దేవుళ్లను అవమానిస్తూ తీసే సీన్లు టెలికాస్ట్ చేయొద్దంటూ రామ్ కదమ్, బీజేపీ ఎమ్యేల్యే ట్వీట్ లో పోలీసులకు కంప్లైంట్ చేశారు.
పొలిటికల్ డ్రామా అయినటువంటి తాండవ్‌పై భారతీయ జనతా పార్టీకి చెందిన మరికొందరు అడ్డుచెప్పారు. ఇప్పటి తాజా కాంట్రవర్సీ అయినటువంటి ఈ షోలో పలు సందర్భాల్లో అవమానించేలా సీన్లు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. గతంలో ఓ సారి హిందూ దేవతలను అవమానించేలా రగ్గులపై, డోర్ మ్యాట్ లపై ఇంటర్నేషనల్ అమెజాన్.కామ్ లో హిందూ దేవుళ్లు ఉన్న వస్తువులను అమ్మారు.
బీజేపీ ఎంపీ మనోజ్ కొటాక్.. ఇండియా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిష్టర్ ప్రకాశ్ జవదేకర్ కు ఈ మేర శనివారం లెటర్ రాశారు. తాండవ్ వెబ్ సిరీస్ మేకర్స్ షోలో హిందూ దేవుళ్లు, హిందూ దేవతలకు వ్యతిరేకంగా సెంటిమెంట్లను కించపరిచేలా చేస్తున్నారు.
స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలను రెగ్యూలేట్ చేసేందుకు ఓ మంత్రిత్వ శాఖ రావాలని.. ఇటువంటి వెబ్ సిరీస్ లను బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కామెంట్లకు అమెజాన్ రెస్పాండ్ అవలేదు.
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!