తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 19, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరోసారి తగ్గింది... తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు... ఇదే సమయంలో 298 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,128కు చేరుకోగా.. 2,86,542 మంది రికవరీ అయ్యారు.. ఇక, ఇప్పటి వరకు 1,581 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 96.6 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 98.08 శాతంగా ఉందని.. ప్రస్తుతం 4,005 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 2,283 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా 31,486 శాంపిల్స్ టెస్ట్ చేశామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 75,15,066కు చేరిందని బులెటిన్‌లో పేర్కొన్నారు అధికారులు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!