బహ్రెయిన్లో మ్యాగీ నూడుల్స్ సేఫ్

- May 29, 2015 , by Maagulf
బహ్రెయిన్లో మ్యాగీ నూడుల్స్ సేఫ్

 

పిల్లలూ పెద్దలూ ఎంతో ఇష్టంగా తినే టైమ్‌ పాస్‌ స్నాక్స్‌గా మ్యాగీకి ఎంతో పేరుంది. అయితే మోతాదుకి మించి ‘లెడ్‌’ వినియోగం మ్యాగీ నూడుల్స్‌లో ఉంటోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ ఆరోపణలతోనే ఓ రాష్ట్రంలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మ్యాగా నూడుల్స్‌పై నిషేధం కూడా విధించారు.అయితే బహ్రెయిన్లో మ్యాగీ నూడుల్స్‌పై ఏమాత్రం అపోహలు అవసరం లేదని అక్కడి ఆ సంస్థ ప్రతినిథులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు మ్యాగీ నూడుల్స్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేమనీ, వినియోగదారుల నుంచి కూడా ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని అధికారులు చెప్పారు. బహ్రెయిన్ మ్యాగీ మార్కెటింగ్‌ సంస్థ ప్రతినిథులు, ఓ ప్రోడక్ట్‌పై మాత్రమే ఆరోపణలు వచ్చాయనీ, వాటిని నిశితంగా స్వతంత్ర సంస్థ ద్వారా పరీక్షించాల్సి ఉంటుందని, తమ ప్రమాణాల ప్రకారం మ్యాగీ ఎలాంటి ప్రమాదకర అవశేషాలు లేదని తేలిందని చెప్పారు.

 

     --- యం.వాసుదేవ రావు (బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com