తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన PRC నివేదిక విడుదల
- January 27, 2021_1611730254.jpg)
హైదరాబాద్:తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ నివేదిక విడుదలైంది. తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించినా.. ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్ సైట్ లో ప్రభుత్వం పెట్టింది. 7.5శాతం ఫిట్‌మెంట్‌ను బిశ్వాల్ కమిటీ సిఫార్సు చేసింది. మరోవైపు పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని కూడా రికమెండ్ చేసింది. ఇటు నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ నేటి నుంచి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనుంది. తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు త్రిసభ్యకమిటీ ఆహ్వానం పంపింది. సాయంత్రం ఐదు గంటల నుంచి హైదరాబాద్ లోని బీఆర్కే భవన్లో చర్చలు జరుగుతాయి. రెండు సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ చర్చల్లో పాల్గొంటారు. గురువారం నుంచి రెండు లేదా నాలుగు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలను పురస్కరించుకొని త్రిసభ్య కమిటీ విడిగా సమావేశం కానుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!