కోవిడ్ వ్యాక్సిన్: ఉచిత ట్యాక్సీ రైడ్స్ ప్రకటన
- January 27, 2021
యూఏఈ: దుబాయ్ ట్యాక్సీ (హాలా), ఎంపిక చేసిన వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఫ్రీ రైడ్ హోం సౌకర్యాన్ని అందించనుంది. కరోనా వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 10 వ్యాక్సిన్ కేంద్రాల నుంచి ఈ ఫ్రీ రైడ్ అందుబాటులో వుంటుంది. 30 దిర్హాములకు మించకుండా ఈ ఉచిత రైడ్ అందిస్తారు. రెండు రైడ్స్ అందించనున్నారు. క్యాష్ లేదా కార్డు రూపంలో చెల్లించేవారికే ఈ క్రెడిట్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. వ్యాలెట్లకు వర్తించదు. అలిత్తిహాద్ హెల్త్ సెంటర్, హోర్ అల్ అన్జ్ హెల్త్ సెంటర్, అల్ కుసైస్ హెల్త్ సెంటర్, జబీల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, అల్ మిజార్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, అల్ బర్షా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, అల్ సఫా ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, వన్ సెంట్రల్, దుబాయ్ పార్క్స్ మరియు రిసార్ట్స్ కేంద్రాల నుంచి ఫ్రీ రైడ్‌ని ప్రకటించారు. కరీమ్ యాప్ ఓపెన్ చేసి హలా ట్యాక్సీని ఎంపిక చేయాలి. పిక్ అప్ అలాగే డ్రాప్ ఆఫ్ లొకేషన్ ఎంపిక చేసుకోవాలి. హలా లేదా హలా వ్యాన్ సెలక్ట్ చేసుకోవాలి. ప్రోమో కోడ్ హలావాక్ ఎంటర్ చేయాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!