బహ్రెయిన్, శ్రీలంకలకు వ్యాక్సిన్ పంపిన ఇండియా

- January 28, 2021 , by Maagulf
బహ్రెయిన్, శ్రీలంకలకు వ్యాక్సిన్ పంపిన ఇండియా

బహ్రెయిన్: భారతదేశంలో తయారవుతున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ని బహ్రెయిన్ అలాగే శ్రీలంకలకు భారత ప్రభుత్వం పంపింది. మొత్తం 50,6400 డోసులను శ్రీలంకకు పంపగా, బహ్రెయిన్‌కి 10,800 డోసులు అందనున్నాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ వ్యాక్సిన్‌ని తయారు చేస్తోన్న సంగతి తెలిసిందే. బహ్రెయిన్ గతంలోనే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భూటాన్, మాల్దీవులు, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ తదితర దేశాలకూ భారత ప్రభుత్వం వ్యాక్సిన్లను పంపుతోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com