దుబాయ్ చేరుకునే విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ

దుబాయ్ చేరుకునే విదేశీ ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలు జారీ

దుబాయ్:కోవిడ్ వేరియంట్స్ నేపథ్యంలో దుబాయ్ చేరుకునే అంతర్జాతీయ ప్రయాణికుల ప్రొటోకాల్ ను అప్ డేట్ చేసింది దుబాయ్. పీసీఆర్ టెస్ట్ నెగటీవ్ రిపోర్ట్ ఉంటేనే దుబాయ్ బయల్దేరేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణ సమయానికి 72 గంటల లోపు జారీ అయిన పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ను మాత్రమే పరిగణలోని తీసుకుంటామని అధికారులు వివరించారు. జనవరి 31 నుంచి అప్ డేట్ అయిన మార్గనిర్దేశకాలు అమలులోకి రానున్నాయి. దుబాయ్ లో ల్యాండ్ అయిన తర్వాత మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే..యూఏఈ పౌరులు మాత్రం బయల్దేరే ముందు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ సమర్పించాల్సిన అవసరం లేదు. యూఏఈ పౌరులు నేరుగా దుబాయ్ చేరుకున్న తర్వాత పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. 

Back to Top