గ్రీన్‌టీ తో దంతాల సమస్యలకు చెక్‌

- January 29, 2021 , by Maagulf
గ్రీన్‌టీ తో దంతాల సమస్యలకు చెక్‌

పళ్లకు సంబంధించిన సమస్యల్లో పాచి ఒకటి. అది పళ్లు పుచ్చి పోవడానికి కారణమవుతుంది. గ్రీన్‌ టీ తీసుకోవడం వల్ల దీని బారి నుంచి బయట పడొచ్చు. గ్రీన్‌ టీలో ‘ఎపిగల్లోకాటెజిన్‌ గాలెట్‌ ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవానికి కారణమయ్యే బ్యాక్టీరియాతో విపరీతంగా పోరాడుతుంది.

కొన్నికొన్నిసార్లు మనం తీసుకునే ఫుడ్‌లోని చిన్నచిన్న తునకలు పళ్లలో ఇరుక్కుని, బ్యాక్టీరియాగా మారి దంత క్షయానికి కారణమవుతుంది. ఈ విషయంలోనూ గ్రీన్‌ టీ సాయపడుతుంది. బ్యాక్టీరియాను తగ్గించడంలో గ్రీన్‌టీ మంచి రోల్‌ పోసిస్తుందన్న విషయం పలు అధ్యయనాల్లో రుజువైంది.నోటికి సంబంధించిన సమస్య గొంతు వెనక భాగానికి కూడా పాకుతుంది.

అక్కడ బ్యాక్టీరియా పెరిగి నోటి దుర్వాసనకు కారణమవుతుంది. ఆ ప్రదేశాన్ని టూత్‌ బ్రెష్‌తో కూడా క్టీన్‌ చేయలేం. దాంతో ఒకసారి అక్కడ బ్యాక్టీరియా చేరాక, దుర్వాసనను దూరం చేయడం కష్టమైన పని దీనికి కూడాగ్రీన్‌ టీ ఉపయోగపడుతుంది. గ్రీన్‌ టీలోని పాలీ ఫెనాల్స్‌ ఈ బ్యాక్టీరియాను అడ్డుకోవడంలో సాయపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com