టీ20 ఆసీయా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

- February 24, 2016 , by Maagulf
టీ20 ఆసీయా కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

టీ20 ఆసీయా కప్ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 45 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 166/6 పరుగులు చేసింది. భారత్ జట్టులో రోహిత్‌శర్మ 55 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట చివరిలో హార్దిక్ పాండ్య మెరుపు ఇన్నింగ్స్‌తో 18 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 167 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో బంగ్లాదేశ్ ఆరంభంలోనే తడబడి రెండు ప్రధాన వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. బంగ్లా జట్టులో షబ్బీర్ రహమాన్ 32 బంతుల్లో 44 పరుగులు మినహ జట్టులో ఎవరు చెప్పుకోతగ్గ పరుగులు చేయలేకపోయారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ 127/7 పరుగులు చేసి 45 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com