ట్యాక్సీ డ్రైవర్‌కి సన్మానం

- February 02, 2021 , by Maagulf
ట్యాక్సీ డ్రైవర్‌కి సన్మానం

యూఏఈ:వినియోగారులైన ప్రయాణీకులకు తగిన సేవలందించడంలో తనదైన ప్రత్యేకత సంపాదించుకున్న ఓ ట్యాక్సీ డ్రైవర్‌ని అజ్మన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఎపిటిఎ) సన్మానించింది. నడి రోడ్డుపై ఓ వాహనం బ్రేక్ డౌన్ అవగా, ఆసియాకి చెందిన డ్రైవర్ మొంతాజర్ హుస్సేన్ రహ్మత్ అలీ సకాలంలో సాయం అందించడం జరిగింది. అతని గురించి పోలీసులు ఆరా తీయగా, ఆయన మరిన్ని మంచి పనులు చేసినట్లుగా తేలింది. దాంతో, అజ్మన్ పోలీస్ ఆ మంచి ట్యాక్సీ డ్రైవర్ మంతాజర్‌ని గౌరవించాలని నిర్ణయించుకుంది. ఈ గౌరవం తనకు దక్కడం పట్ల చాలా ఆనందంగా వుందనీ, తాను కూడా కొందరు ప్రయాణీకుల ఆగ్రహాన్ని చవిచూసినా, వారిని శాంతపర్చడంలో తనవంతు కృషి చేసి మంచి ఫలితాల్ని సాధించినట్లు పేర్కొన్నారు ముంతాజర్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com