సౌదీకి విమానాల్ని రద్దు చేసిన ఎతిహాద్, ఎమిరేట్స్

- February 03, 2021 , by Maagulf
సౌదీకి విమానాల్ని రద్దు చేసిన ఎతిహాద్, ఎమిరేట్స్

రియాద్:20 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై బ్యాన్ విధించిన దరిమిలా, యూఏఈకి చెందిన పలు ఎయిర్ లైన్స్ సంస్థలు సౌదీ అరేబియాకి ప్రయాణీకుల విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఎతిహాద్ ఎయిర్ వేస్, ఎమిరేట్స్ ఫిబ్రవరి 3 రాత్రి 9 గంటల నుంచి ఈ విమానాల రద్దు అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నాయి. సౌదీ జాతీయులు, పౌరులు, డిప్లమాట్స్, హెల్త్ ప్రాక్టీషనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఈ బ్యాన్ వర్తించదు. నిషిద్ధ జాబితాలోని దేశాలకు వెళ్ళినవారు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో వుండాల్సి వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com