ఉరుములతో కూడిన వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని సౌదీ హెచ్చరిక
- February 04, 2021
రియాద్:మరో మూడు రోజుల్లో సౌదీలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈ సమయంలో ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని జాతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ సూచనలతో పౌర రక్షణ విభాగం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సౌదీ రాజధాని రియాద్ తో పాటు మక్కా, మదీనా, తూర్పు ప్రావిన్స్, ఖాసిమ్, తబుక్, హెయిల్, ఉత్తర సరిహద్దు ప్రావిన్స్ లలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే..కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని, వరదలకు ఆస్కారం లేకపోలేదని కూడా హెచ్చరించింది. దీన్ని దృష్టిలో ఉంచికొని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముప్పు నుంచి తప్పించుకునేందుకు సివిల్ డిఫెన్స్ విభాగం సూచనలను పాటించాలని తెలిపింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







