అబుధాబిలోని కరోనా ఆంక్షలు..సినిమా హాళ్లు క్లోజ్, మాల్స్ పై పరిమితి విధింపు

- February 06, 2021 , by Maagulf
అబుధాబిలోని కరోనా ఆంక్షలు..సినిమా హాళ్లు క్లోజ్, మాల్స్ పై పరిమితి విధింపు

యూఏఈలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతుండటంతో పలు ఎమిరాతిలు ఆంక్షలను కఠినతరం చేస్తున్నాయి. కింగ్డమ్ గత కొన్ని వారాలుగా దాదాపు 3000పైనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు ఎమిరాతిలు తమ పరిధిలోని ఈవెంట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పలు రంగాలను పరిమిత సేవలకు కదిస్తూ తాత్కాలిక ఆంక్షలు విధించాయి. యూఏఈ రాజధాని అబుధాబి కూడా కరోనా ఆంక్షలను కఠినం చేసింది. ఎమిరాతి పరిధిలోని సినిమా హాళ్లను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు హాల్స్ తెరవకూడదని స్పష్టం చేసింది. షాపింగ్ మాల్స్ లో 40 శాతం వినియోగదారులకు మాత్రమే అనుమతించాలని, రెస్టారెంట్లు, కేఫ్  లలో పూర్తి కెపాసిటీలో 60 శాతం వరకే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎమిరాతిలోని అన్ని సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ నిర్వహాకులకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే వ్యాపారాలు గాడిన పడేందుకు అడుగులు పడుతున్న సమయంలో మళ్లీ ఆంక్షలు అమలులోకి రావటం...పలు రంగాలకు దెబ్బ మీద దెబ్బ పడినట్లైంది. అయినా..ప్రజల ఆరోగ్య భద్రత కోసం ఎమిరాతి పాలన యంత్రాంగం సూచనల మేరకు తదుపరి నోటీసులు వచ్చే వరకు సినిమా స్క్రీన్లను మూసివేస్తున్నామని వీఓఎక్స్ సినిమాస్ నిర్వాహకులు తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com