కువైట్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష..10 వేల దినార్ల ఫైన్
- February 06, 2021
కువైట్ సిటీ:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంటు వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు దేశంలోని ప్రతి ఒక్కరు సుప్రీం కమిటీ సూచించిన అన్ని ముందస్తు జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారికి పది వేల దినార్ల వరకు జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడుతుందని..ఉల్లంఘన తీవ్రతను బట్టి జైలుశిక్ష, జరిమానా రెండు విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. సమాజ ఆరోగ్య భద్రత కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా నడుచుకోవాలని సూచించింది. పబ్లిక్ గ్యాదరింగ్స్ కు దూరంగా ఉండి భౌతిక దూరం పాటించాలని చెప్పింది. చివరికి నేషనల్ హాలీడేస్ సెలబ్రేషన్లలో కూడా ఎవరూ గుమికూడొద్దని, పబ్లిక్ ఈవెంట్లే కాదు ప్రైవేట్ సెలబ్రేషన్స్, చివరికి ఇంటిలో కూడా వేడుకలు చేసుకోకపోవటం మంచిదని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!