హైదరాబాద్ లో బోయింగ్ విమానాల తయారీ...

- February 06, 2021 , by Maagulf
హైదరాబాద్ లో బోయింగ్ విమానాల తయారీ...

హైదరాబాద్:ఇండియా ఇటీవ‌లే తీసుకొచ్చిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ క‌ల సాకారం దిశగా అడుగులు ప‌డుతున్నాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఇండియాలోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌తో ఇప్ప‌టికే టైఅప్ అయింది.ఇందులో విమానాల కాంప్లెక్స్ వెర్టిక‌ల్ ఫిన్ విడిభాగాల‌ను త‌యారు చేయ‌బోతున్నారు.హైద‌రాబాద్ కేంద్రంగా వీటి విడిభాగాల ఉత్ప‌త్తి జ‌ర‌గ‌బోతున్న‌ది.ఈ వెర్టిక‌ల్ స్టెబిలైజ‌ర్‌ను విమానం తోక పైభాగంలో అమ‌ర్చుతారు.  విమానాల్లో అత్యంత కీల‌క‌మైన భాగాల్లో ఈ వెర్టిక‌ల్ స్టెబిలైజ‌ర్ కూడా ఒక‌టి. ఇప్ప‌టికే టాటా బోయింగ్ సంస్థ‌లు బోయింగ్ ఎహెచ్ 64 అపాచీ హెలికాఫ్టర్ల‌కు ఏరే స్ట్ర‌క్చ‌ర్ల‌ను త‌యారు చేస్తున్న‌ది.  దీంతోపాటుగా ఇప్పుడు బోయింగ్ విమానాల‌కు సంబందించిన విడిభాగాల‌ను కూడా టాటా బోయింగ్‌లో త‌యారు కాబోతుండ‌టం విశేషం.  అంతేకాదు, టాటా సంస్థ త్వ‌ర‌లోనే సైనిక ర‌వాణ కోసం వినియోగించే సి 239 భారీ విమానాల‌ను కూడా త‌యారు చేయ‌బోతున్న‌ది. కేంద్రం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే టాటా సంస్థ ఈ ర‌వాణ విమానాల‌ను త‌యారు చేస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com