హైదరాబాద్ లో బోయింగ్ విమానాల తయారీ...
- February 06, 2021
హైదరాబాద్:ఇండియా ఇటీవలే తీసుకొచ్చిన ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ ఇండియాలోని టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్‌తో ఇప్పటికే టైఅప్ అయింది.ఇందులో విమానాల కాంప్లెక్స్ వెర్టికల్ ఫిన్ విడిభాగాలను తయారు చేయబోతున్నారు.హైదరాబాద్ కేంద్రంగా వీటి విడిభాగాల ఉత్పత్తి జరగబోతున్నది.ఈ వెర్టికల్ స్టెబిలైజర్‌ను విమానం తోక పైభాగంలో అమర్చుతారు. విమానాల్లో అత్యంత కీలకమైన భాగాల్లో ఈ వెర్టికల్ స్టెబిలైజర్ కూడా ఒకటి. ఇప్పటికే టాటా బోయింగ్ సంస్థలు బోయింగ్ ఎహెచ్ 64 అపాచీ హెలికాఫ్టర్లకు ఏరే స్ట్రక్చర్లను తయారు చేస్తున్నది. దీంతోపాటుగా ఇప్పుడు బోయింగ్ విమానాలకు సంబందించిన విడిభాగాలను కూడా టాటా బోయింగ్‌లో తయారు కాబోతుండటం విశేషం. అంతేకాదు, టాటా సంస్థ త్వరలోనే సైనిక రవాణ కోసం వినియోగించే సి 239 భారీ విమానాలను కూడా తయారు చేయబోతున్నది. కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టాటా సంస్థ ఈ రవాణ విమానాలను తయారు చేస్తుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!