2022 ఫీఫా వరల్డ్ కప్ కు సిద్ధమైన ఖతార్..యూఏఈలో ప్యాకేజ్ సేల్స్ షురూ

- February 09, 2021 , by Maagulf
2022 ఫీఫా వరల్డ్ కప్ కు సిద్ధమైన ఖతార్..యూఏఈలో ప్యాకేజ్ సేల్స్ షురూ

దోహా:కోవిడ్ సీజన్లో బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్ కు రెడీ అవుతోంది ఖతార్. వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో జరగబోయే ఫిఫా వరల్డ్ కప్ కు సై అంటోంది. ఇప్పటికే వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో వచ్చే ఏడాది నాటికి వరల్డ్ కప్ ఆటంకాలు ఉండే అవకాశాలు లేవని ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే..గల్ఫ్ కంట్రీస్ చరిత్రలోనే జరుగుతున్న తొలి ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను అభిమానులు పూర్తిస్థాయిలో ఆస్వాదించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు..ఆసియాలో దేశాల్లోనే ఇది రెండో ఫిఫా వరల్డ్ కప్ కావటం విశేషం. ఈ మెగా ఈవెంట్ కు విడిది స్లాట్స్, టికెట్ల  అమ్మకాలను కూడా ప్రారంభమయ్యాయి. యూఏఈలోని ఫుట్ బాల్ ఫ్యాన్స్ కోసం డీఎంసీసీ అనే స్పోర్ట్ టూరిజం ప్యాకేజీల వారీగా టికెట్ సేల్స్ ప్రారంభించింది. దుబాయ్ బేస్డ్ డీఎంసీసీ స్పోర్ట్ టూరిజం ప్రవాసీయుడి చెందిన విషయం తెలిసిందే. ఫుట్ బాల్ అభిమానుల కోసం హై రేంజ్లో ఉన్న ‘పెర్ల్ లాంజ్’ ప్యాకేజీతో పాటు.. ఇష్టమైన ఆటను ఆస్వాదించేలా ‘మ్యాచ్ క్లబ్’ కిందిస్థాయి ప్యాకేజీని ప్రకటించింది. అలాగే మిడిల్ క్లాస్ ప్యాకేజీల్లో భాగంగా...మ్యాచ్ ప్రైవేట్ సూట్, మ్యాచ్ బిజినెస్ సీట్, మ్యాచ్ పెవిలియన్  ఇంటర్మీడియట్ ప్యాకేజీల నుండి కూడా ఎంచుకోవచ్చని డీఎంసీసీ వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలోనే టికెట్ సేల్స్ ప్రారంభం అవగా..అభిమానుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని సేల్స్ ఇన్ ఛార్జ్ వెల్లడించారు. కోవిడ్ భయాందోళనలోనూ అభిమానుల నుంచి వస్తున్న స్పందనను చూస్తుంటే..టికెట్ల సేల్స్ లో కొత్త రికార్డ్ ఖాయంగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్యాకేజీ ధరలు 14,350 యూఎస్ డాలర్ల నుంచి 74,200 యూఎస్ డాలర్ల వరకు ఉన్నాయని వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com