సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..

- February 10, 2021 , by Maagulf
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి..

మనామా:ఇంటర్నెట్ వేదికగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సూచించింది. ఇటీవలి కాలంలో వెలుగులోకి వచ్చిన సైబర్ నేరాల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక మేరకు ఈ సూచనలు చేసింది. సైబర్ నేరగాళ్లు బ్యాంక్ ఖాతాదారులకు ఫోన్ చేసి మాయమాటలతో వారి బ్యాంక్ ఖతా వివరాలు, పాస్ వర్డ్, ఓటీపీలను తెలుసుకొని అకౌంట్లోని డబ్బులు కాజేస్తారని ప్రజలను అప్రత్తం చేసింది. అపరిచితులు ఎవరు ఫోన్ చేసినా..బ్యాంక్ వివరాలను వెల్లడించొద్దని పేర్కొంది. సైబర్ నేరగాళ్ల ముఠా ఎక్కువగా విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయని..కాజేసిన సొమ్ము కూడా విదేశాల్లోని అకౌంట్లోకి బదిలీ అవుతుండటంతో రికవరి కూడా కష్టతరంగా మారింది. ఇదిలాఉంటే..ఇటీవలె పట్టుబడిన ఓ
సైబర్ ముఠా కేసు పబ్లిక్ ప్రాసిక్యూషన్ ముందుకు విచారణకు వచ్చింది. వారి దగ్గర బ్యాంక్ ఖతాదారుల వివరాలు, బ్యాంక్ డేటా ఉన్నట్లు విచారణలో తేలింది. అలాగే బాధితుల సొమ్మును విదేశాల్లోని ఖాతాలకు బదిలీ చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ప్రస్తుతం కోర్టు ట్రయల్ లో ఉన్న ఈ కేసులో నిందితులు దోషులుగా నిర్ధారణ అయితే సైబర్ చట్టాల మేరకు పదేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష వరకు బహ్రెయిన్ దినార్ల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయి.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com