కోవిడ్ రూల్స్ ఉల్లంఘన: టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా

- February 12, 2021 , by Maagulf
కోవిడ్ రూల్స్ ఉల్లంఘన: టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా

దుబాయ్:దుబాయ్ పోలీసులు, టూర్ నిర్వాహకుడికి 50,000 దిర్హాముల జరీమానా విధించడం జరిగింది. కోవిడ్ 19 నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడమే సదరు నిర్వాహకుడిపై జరీమానా వేయడానికి కారణమని అధికారులు తెలిపారు. ఈ మేరకు దుబాయ్ మీడియా ఆఫీస్ ఓ వీడియో సోషల్ మీడియాలో విడుదల చేసింది.ఔట్ డోర్  గేదరింగ్ నిర్వహణకుగాను నిందితుడిపై చర్యలు తీసుకున్నారు.తాజా సూచనల ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో 10 మంది కంటే ఎక్కువ గుమికూడేలా ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టకూడదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com