ఆర్థిక భరోసానిచ్చే పాలసీ..

- February 17, 2021 , by Maagulf
ఆర్థిక భరోసానిచ్చే పాలసీ..

ప్రభుత్వ సంస్థ ప్రముఖ బీమా సంస్థ ఎల్‌ఐసీ..ఇది అత్యంత విశ్వసనీయ సంస్థ. అధిక సంఖ్యలో ప్రజలు పెట్టుబడి పెట్టడానికి ఇదే ప్రధాన కారణం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాలసీలను తీసుకువస్తూ ప్రజల ప్రయోజనార్థం పని చేస్తుంటుంది.ఈ సంస్థ తీసుకొచ్చిన పాలసీలలో జీవన్ ఆనంద్ పాలసీకి మంచి ప్రాచుర్యం లభించింది. పాలసీ గడువు ముగిసిన తరువాత కూడా బీమా కొనసాగడం ఈ పాలసీ ప్రత్యేకత. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి కొత్తగా ఎల్‌ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ అని ఒకటి తీసుకువచ్చింది ఎల్‌ఐసీ కొద్దినెలల క్రితం.

ఇక ఇందులో చేరేందుకు కనీస వయస్సు 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.కనీస బీమా లక్ష అంతకు మించి ఎంతైనా గరిష్ట పరిమితి లేదు.కాలపరిమితి 15 నుంచి 35 ఏళ్ల కాలం. ఉదాహరణకు పాలసీ దారుడు 35 ఏళ్ల వయసులో 5 లక్షలు పెట్టుబడి పెట్టి ఈ పాలసీ తీసుకున్నాడని అనుకుందాం.అప్పుడు అతడు నెలకు రూ.1650లు (అంటే రోజుకు రూ.55)చెల్లిస్తే సరిపోతుంది. మూడు నెలలకు ఒకసారి కట్టాలి అనుకుంటే రూ.5000, అదే ఆరు నెలలకు కట్టాలనుకుంటే రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కడతానంటే కూడా ఒకేసారి రూ.20000 చెల్లించొచ్చు. ఒకవేళ పాలసీ దారుడు గడువులోపే మరణిస్తే అప్పుడు నామినీకి రూ.5,00,000 లక్షలు చెల్లిస్తారు. ఈ విధంగా మొత్తం 25 సంవత్సరాలు పెట్టుబడి పెట్టిన తరువాత పాలసీదారునికి ఎస్‌ఐ రూపంలో రూ.5,00,000, బోనస్ కింద రూ.5,75000, చివరిగా అదనపు బోనస్ కింద రూ.2,25,000 లభిస్తాయి. ఈ విధంగా 60 ఏళ్ల వయసు వచ్చేసరికి పాలసీ దారునికి 1300000 అందుకున్నట్లవుతుంది.

మరిన్ని వివరాలకు ఈ నెంబర్ 00919949322175 కి కాల్ చెయ్యగలరు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com