సౌదీ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న మహిళల సంఖ్య
- February 17, 2021
సౌదీ: మహిళా స్వాలంభన దిశగా సౌదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దేశ న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య అంతకంతకు పెరుగుతూ వస్తోంది. జ్యూడిషియల్ సెక్టార్ లో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న వారి సంఖ్య గతేడాదిలో 1,814 మందికి పెరిగింది. ఇక లాయర్లుగా లైసెన్స్ పొందిన మహిళల సంఖ్య 2019లో 618గా ఉంటే... 2020లో 1,029కి పెరిగింది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 66 శాతం పెరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖలోని మహిళా విభాగం డైరెక్టరేట్ కార్యాలయం వివరించింది. జ్యూడిషియల్ సెక్టార్లోని లీగల్, సోషల్ రీసెర్చర్స్, అడ్మినిస్ట్రేటీవ్ అసిస్టెంట్స్, ప్రోగ్రామ్ డెవలపర్స్ ఇలా పలు విభాగాల్లో 2020 నాటికి 30,500 మంది సేవలు అందిస్తున్నారని వివరించింది. వుమెన్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయటం వల్లే మహిళా ఉద్యోగుల సంఖ్య పెరిగేందుకు దోహదపడిందని, ఇటీవలె న్యాయ శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశామని పేర్కొంది. లాయర్లుగా లైసెన్స్ పొందెందుకు ఈ శిక్షణ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని..ప్రస్తుతం 4,070 మంది ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతుండగా..అందులో 1,680 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. విజన్ 2030 లక్ష్యం మేరకు దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యిన్ని పెంపొందించే దిశగా కృషి చేస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫీస్ వివరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







