కోవిడ్ కొత్త స్ట్రెయిన్ మరింత వేగంగా విస్తరిస్తోంది

- February 18, 2021 , by Maagulf
కోవిడ్ కొత్త స్ట్రెయిన్ మరింత వేగంగా విస్తరిస్తోంది

మనామా:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండర్ సెక్రెటరీ అలాగే నేషనల్ మెడికల్ టాస్క్‌ఫోర్స్ మెంబర్ డాక్టర్ వాలీద్ ఖలీఫా అల్ మనీయా మాట్లాడుతూ, కోవిడ్ కొత్త స్ట్రెయిన్ అత్యంత వేగంగా విస్తరిస్తోందని చెప్పారు.ఈ కారణంగా కేసుల తీవ్రత పెరుగుతోందనీ, మరణాల సంఖ్య అలాగే ఇంటెన్సివ్ కేర్ యూనిట్లలో చేరుతున్నవారి సంఖ్య ఎక్కువవుతోందని అన్నారు.ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ప్రికాషన్స్ పాటించాలనీ ఆయన విజ్ఞప్తి చేశారు. నవంబర్ 22న 114 కేసులు నమోదు కాగా, ఫిబ్రవరి 12న ఏకంగా 896 కేసులు నమోదవడం వైరస్ వ్యాప్తి తీవ్రతను చెప్పకనే చెబుతోందని అన్నారు. ప్రస్తుతం నాలుగు కోవిడ్ వ్యాక్సిన్లు బహ్రెయిన్‌లో అందుబాటులో వున్నాయి. సినోఫామ్, ఫైజర్ బయో ఎన్ టెక్, ఆస్ట్రాజెనకా కోవిషీల్డ్ అలాగే స్పుత్నిక్ వ్యాక్సిన్లను బహ్రెయిన్ అత్యవసర వినియోగంలోకి తెచ్చింది.

--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com