దేశం వస్తున్న ప్రయాణీకులకు 14 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్
- February 18, 2021
కువైట్: బ్యాన్ చేయబడిన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు 14 రోజుల తప్పనిసరి ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుందనీ, ఏ ప్రయాణీకుడూ కువైట్ మోసాఫెర్ యాప్ ద్వారా రిజిస్టర్ కాకుండా ప్రయాణించలేడని కువైట్ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 21 తర్వాత దేశంలోకి వచ్చే ప్రతి ప్రయాణీకుడి నుంచి రెండు పిసిఆర్ టెస్టులకు సంబంధించి ఫీజుని వసూలు చేయడం జరుగుతుందనీ, ఈ మొత్తాన్ని మెసాఫెర్ యాప్ ద్వారానే ప్రయాణీకులు చెల్లించాల్సి వుంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ తమ సొంత ఖర్చులతోనే ప్రయాణీకులు చేసుకోవాల్సి వుంటుంది. నిషేధం లేని దేశాల నుంచి వచ్చేవారికి 7 రోజుల ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వుంటుంది. అది కూడా వారి సొంత ఖర్చులతోనే. కువైట్ మోసాఫెర్ లేదా బెల్సాలామా యాప్ ద్వారా క్వారంటైన్ ఏర్పాట్లు చేసుకోవాలి. పిసిఆర్ పరీక్ష 6వ రోజున చేస్తారు. టెస్టులో నెగెటివ్ వస్తే, ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి. అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలూ ఈ నిబంధనలకు లోబడి వుండే ప్రయాణీకులకు మాత్రమే బోర్డింగ్ సౌకర్యం కల్పించాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!