మస్కట్: ఏప్రిల్ 14 నుంచి రమదాన్ పవిత్ర మాసం ప్రారంభమయ్యే అవకాశాలు

- February 25, 2021 , by Maagulf
మస్కట్: ఏప్రిల్ 14 నుంచి రమదాన్ పవిత్ర మాసం ప్రారంభమయ్యే అవకాశాలు

మస్కట్: మహమ్మదీయుల పవిత్ర మాసం రమదాన్ వచ్చే ఏప్రిల్ 14 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని  ఆవ్‌కాఫ్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని హిజ్రీ క్యాలెండర్ విభాగం అధిపతి ప్రకటించారు. ఈద్ అల్ ఫితర్ మే 13, గురువారం రోజున వస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. 1442 AH సంవత్సరానికి రంజాన్ నెల నెలవంక గురించి చేసిన ఖగోళ గణాంకాల మేరకు ఏప్రిల్ 12, సోమవారం చంద్రుడు సంయోగ దశలో ఉంటాడని..ఉదయం 6:31 గంటలకు చంద్రుడు అస్తమిస్తాడన్నారు. అదే రోజు సాయంత్రం 6:27 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడని..ఆ తర్వాత 20 నిమిషాల వ్యవధి తర్వాత చంద్రోదయం ఉంటుందని లెక్క గట్టారు. దీని ప్రకారం, ఏప్రిల్ 13, 2021 మంగళవారం షాబాన్ నెల పూర్తవుతుందని, 2021 ఏప్రిల్ 14 బుధవారం 1442 సంవత్సరానికిగాను పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమవుతుంది అని ధృవీకరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com