రస్ ఆల్ ఖైమాలో ఇక ఆన్ లైన్లోనే డ్రైవింగ్ లైసెన్స్ అప్లికేషన్స్
- February 25, 2021
రస్ ఆల్ ఖైమా:డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసే దరఖాస్తుదారులు అంతా ఇక ఆన్ లైన్లోనే అప్లై చేయాలని రస్ ఆల్ ఖైమా డ్రైవింగ్ లైసెన్స్ జారీ కేంద్రం, పోలీసు విభాగం అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు ఎవరూ నేరుగా కార్యాలయాలకు రావొద్దని సూచించింది. ఆరోగ్య శాఖ మార్గనిర్దేశాలకు అనుగుణంగా కోవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ద్వారాగానీ, యాప్ ద్వారాగానీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు నేరుగా కార్యాలయాలకు రావటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని, అది ప్రజలకు, సిబ్బందికి హానీకర వాతావరణాన్ని సృష్టించే అవకాశలు ఉన్నాయని వెల్లడించింది. ఆన్ లైన్ అప్లికేషన్ విధానం ద్వారా వ్యాప్తి ముప్పును నియంత్రించటమే కాకుండా అటు దరఖాస్తుదారులు, ఇటు సిబ్బంది సమయం ఆదా అవుతుందని, అలాగే ప్రయాణ కష్టాలు కూడా తప్పుతాయని పేర్కొంది. అయితే...దరఖాస్తుదారులు మెడికల్ చెకప్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్‌డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!
- ‘వన్ ఓషన్, అవర్ ఫ్యూచర్ ’ గ్రాండ్ సక్సెస్..!!
- ఒమన్ ఎయిర్ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ కంటి సమస్యలపై స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!







