ఐపీఎల్ పై మంత్రి కేటీఆర్ స్పందన...
- February 28, 2021
హైదరాబాద్:ఈఏడాది నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కేటీఆర్ స్పందించారు.ఈ సందర్భంగా కేటీఆర్ బీసీసీఐతో పాటు ఐపీఎల్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు.
రాబోయే ఐపీఎల్ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరిన మంత్రి కేటీఆర్.. మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్ధతును ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలో కోసం ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు చెన్నై, బెంగళూరు, దిల్లీలను, కోల్‌కతా, అహ్మదాబాద్‌లను మాత్రమే వేదికలుగా ఎంపిక చేశారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ముంబైని వేదికల జాబితాలో చేర్చాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి హైదరాబాద్‌లో ఐపీఎల్ క్రీడలపై నీలి మేఘాలు కమ్ముకున్నాను.ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.మరి ఐపీఎల్ నిర్వాహన కమిటీ దీనికి అంగీకరిస్తుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!