BREAKING!! వీసాల గడువు పొడిగింపు
- March 01, 2021
అబుధాబి: టూరిస్ట్ వీసా గడువు ముగిసిపోవడం ఇబ్బందులకు గరవుతున్న పర్యాటకులకు యూఏఈ తీపి కబురు చెప్పింది. వీసాల గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. గడువు తీరిపోయిన.. నెల, మూడు నెలల విజిట్ వీసాలు, టూరిస్ట్ వీసాల కాలపరిమితిని మార్చి 31 వరకు పొడగిస్తున్నట్టు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ అఫైర్స్ (జీడీఆర్ఎప్ఏ) ప్రకటించిందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇదే విషయాన్ని ట్రావెల్ ఏజెట్లు కూడా స్పష్టం చేశారు. ‘మా క్లైంట్ల దుబాయ్ వీసాల గడువు మార్చి 31 వరకు అక్కడి ప్రభుత్వం పొడగించింది. ఈ విషయం మా దృష్టికి వచ్చింది’ అని పేర్కొన్నారు. కాగా.. నెల రోజులపాటు వీసాల గడువును ఉచితంగా పొడగించనున్నట్టు.. యూఏఈ ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ డిసెంబర్ 27 వెల్లడించిన విషయం తెలిసిందే. యూరప్ దేశాల్లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభిస్తుండటం, అక్కడి దేశాలు తిరిగి లాక్డౌన్లను విధిస్తుండటంతో ఇది అమలులోకి వచ్చింది.
తాజా వార్తలు
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు









