షార్జా-భారత్ విమానం...పాకిస్తాన్ లో అత్యవసర లాండింగ్

- March 02, 2021 , by Maagulf
షార్జా-భారత్ విమానం...పాకిస్తాన్ లో అత్యవసర లాండింగ్

షార్జా నుంచి భారత్ కు వస్తున్న భారత విమానమొకటి పాకిస్తాన్ లోని కరాచీ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమాన ప్రయాణికుల్లో ఒకరు మరణించడంతో పైలట్ ఈ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేసినట్టు సమాచారం.అయితే చివరకు ఈ విమానం ఈ ఉదయం లక్నో విమానాశ్రయంలో దిగింది. గత ఏడాది నవంబరులో 179 మంది ప్రయాణికులతో ఢిల్లీకి వస్తున్న గో-ఎయిర్ విమానం కూడా కరాచీ విమానాశ్రయంలోనే దిగింది. విమాన ప్రయాణికుడొకరికి గుండె పోటు రావడంతో విమానంలోనే అతనికి అత్యవసర వైద్య చికిత్స చేశారు.అయితే విమానం కరాచీ ఎయిర్ పోర్టులో దిగగానే అతడు మృతి చెందాడు.కాగా తాజా సంఘటనకు సంబందించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com