బిగ్‌బాస్ 5: అందరి కళ్ళు తనపైనే

- March 04, 2021 , by Maagulf
బిగ్‌బాస్ 5: అందరి కళ్ళు తనపైనే

బిగ్‌బాస్ 5వ సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపికలో వైవిధ్యతను కనబరచనున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలో ఐదో సీజన్‌లో ఎవరెవర్ని తీసుకుంటారన్న చర్చ సోషల్‌ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఇప్పటికే వెబ్‌ సిరీస్‌ హీరో అనిపించుకున్న షణ్ముఖ్‌ జశ్వంత్‌ హౌస్‌లోకి రాబోతున్నాడు అని ఆయన అభిమానులు బలంగా ఫిక్సయ్యారు. తాజాగా ఓ సింగర్‌ కూడా ఈసారి రేసులో అడుగుపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌ టాప్‌ సింగర్‌ హేమచంద్ర బిగ్‌బాస్‌ షో ద్వారా తన అభిమానులను అలరించనున్నట్లు సమాచారం.

గతంలోనూ అతడికి బిగ్‌బాస్‌ నుంచి ఆఫర్లు వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల వాటిని సున్నితంగా తిరస్కరించాడు. మరి ఈసారి ఈ ఛాన్స్‌ను వదులుకుంటాడా? లేదా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చరచ్చ చేస్తాడా? అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతడు కంటెస్టెంట్‌గా వస్తే మాత్రం టైటిల్‌ విన్నర్‌ను చేస్తామని శపథం చేస్తున్నారు ఆయన అభిమానులు. కానీ అతడికి బిగ్‌బాస్‌ నిర్వాకుల నుంచి పిలుపు వచ్చిందనేది కేవలం సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com