పోలీసులకు లంచం ఇవ్వబోయిన ఉద్యోగుల అరెస్ట్

- March 06, 2021 , by Maagulf
పోలీసులకు లంచం ఇవ్వబోయిన ఉద్యోగుల అరెస్ట్

అబుధాబి:అక్రమాలకు పాల్పడటమే కాకుండా..తమపై చట్టపరమైన చర్యకు సిద్ధమైన పోలీసులకు అవినీతి బురద అంటించబోయారు కొందరు ప్రబుద్ధులు. తమ చట్టవిరుద్ధ చర్యలను చూసి చూడనట్టు వదిలేయాలని అందుకు కొంత మొత్తాన్ని లంచంగా ఇస్తానని ఆశ చూపించారు. వాళ్లంతో ఓ కంపెనీలో ఉద్యోగులు. అయితే..ఉద్యోగుల ప్రలోభాలకు లొంగని పోలీస్ అధికారి....అక్రమాలకు పాల్పడటమే కాకుండా లంచం ఆశ చూపినందుకు ఉద్యోగులను అరెస్ట్ చేసి జైలుకి పంపించాడు. యూఏఈ రాజధాని అబుధాబిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అబుధాబి పోలీసు విభాగంలోని అవినీతి నిరోధక అధికారులు ఉద్యోగుల బాగోతాన్ని ఫేస్ బుక్ పేజిలో పోస్ట్ చేశారు. ఓ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు లంచం ఆశ చూపించి చట్టం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారని..ఇలాంటి ప్రవర్తనలను పోలీసు శాఖ ఉపేక్షించబోదని హెచ్చరించారు. ఉద్యోగుల ప్రలోభాలకు లొంగకుండా నీతికి ఉద్యోగ ధర్మానికి కట్టుబడి విధులు నిర్వహించిన ఆ పోలీస్ అధికారి నిజాయితీని ఉన్నతాధికారులు ప్రశంసించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com