FLASH..FLASH..తొలిసారిగా అలెర్జీ ఉన్న రోగులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్లు

- March 15, 2021 , by Maagulf
FLASH..FLASH..తొలిసారిగా అలెర్జీ ఉన్న రోగులకు సైతం కోవిడ్ వ్యాక్సిన్లు

కువైట్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బారినుండి ప్రజలను కాపాడే దిశగా వ్యాక్సిన్లు అందిస్తున్నాయి అన్ని దేశాలు. ముఖ్యంగా వృద్దులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది. అయితే, ఏవైనా ఎలర్జీలు ఉన్నా..ఏదైనా పలు మందులకు ఎలర్జీలు ఉన్నా..వారిని ఈ వ్యాక్సిన్లకు దూరంగా ఉంచున్న విషయం విదితమే.

వీటికి భిన్నంగా అలెర్జీ ఉన్నవారికి వ్యాక్సిన్లను అందిస్తోంది కువైట్ మంత్రిత్వ శాఖ. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకునే ఈ కార్యక్రమం చేపట్టినట్టు అధికారులు ధృవీకరించారు. అలెర్జీ ఉన్న రోగులలో విస్తృతమైన అధ్యయనాలు జరిపి..ఎటువంటి దుష్ప్రభావాలు లేకపోవడంతో అలెర్జీ ఉన్నవారికి సైతం టీకాలు వేయడం ప్రారంభించింది కువైట్ ప్రభుత్వం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com