ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ భద్రతపై ఆందోళన.. నేడు WHO సమీక్ష!
- March 16, 2021
జెనీవా:ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ భద్రతపై WHO నిపుణుల కమిటీ బుధవారం సమీక్ష జరపనుంది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తీసుకున్న పలువురిలో రక్తం గడ్డకడుతున్నట్టు ఇటీవల వార్తలు రావడంతో పలు దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్‌పై నిషేధం విధించాయి. అయితే, పలుదేశాల్లో టీకా పంపిణీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ భద్రతపై చర్చించేందుకు నిపుణుల కమిటీ మంగళవారం సమావేశం కానుంది.ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనోమ్ తెలిపారు. వ్యాక్సిన్ భద్రతపై అందుబాటులో ఉన్న డేటాను WHO సలహా కమిటీ సమీక్షిస్తోందని పేర్కొన్నారు. మరోపక్క టీకా వినియోగం, సమర్ధతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై గురువారం 'అసాధారణ సమావేశం' నిర్వహించనున్నట్లు యూరోపియన్ యూనియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తెలిపింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!