రమదాన్ నేపథ్యంలో కోవిడ్ కొత్త మార్గనిర్దేశకాలు జారీ చేసిన దుబాయ్
- March 18, 2021
దుబాయ్: పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో దుబాయ్ సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. ప్రార్థనలు, ఇఫ్తార్ విందుల నిర్వహణతో వైరస్ వ్యాప్తి మరింత వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయంటూ హెచ్చరించింది. కోవిడ్ ను అరికట్టేందుకు రమదాన్ మాసంలోనూ ఆంక్షల అమలు అనివార్యమంటూ పేర్కొంది. ముఖ్యంగా వృద్ధులు , దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సమాజ ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని సోషల్ గ్యాదరింగులపై నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేసింది. అలాగే రమదాన్ టెంట్లను, ఇఫ్తార్ విందులు, డొనేషన్ టెంట్లపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తారవీ ప్రార్థనల సమయంలోనూ మసీదులలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని దుబాయ్ సుప్రీం కమిటీ హెచ్చరించింది. ప్రార్థన సమయం 30 నిమిషాలకు పరిమితం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలాఉంటే..ఎమిరాతి పరిధిలో కోవిడ్ తీవ్రతను పరిగణలోకి తీసుకొని రమదాన్ చివరి పది రోజుల ప్రార్థనలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కమిటీ క్లారిటీ ఇచ్చింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









