భారత్ లో కరోనా కేసుల వివరాలు

- March 21, 2021 , by Maagulf
భారత్ లో కరోనా కేసుల వివరాలు

న్యూ ఢిల్లీ: భారత్ లో రోజువారీ పాజిటివ్ కేసులు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి.నాలుగు నెలల క్రితం ఏ స్థాయిలో కేసులు నమోదయ్యాయో అదే విధంగా ఇప్పుడు కేసులు నమోదవుతుండటం కొంత భయాన్ని కలిగిస్తోంది.సెకండ్ వేవ్, కొత్త స్ట్రెయిన్ వేరియంట్లు మన దేశంలో పెద్దగా కనిపించలేదని నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే.అయితే, ఇప్పుడు కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.తాజాగా దేశంలో 43,846 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు 1,15,99,130 కేసులు నమోదయ్యాయి.ఇందులో 1,11,30,288 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,09,087 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో 22,956 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 197 మంది మృతి చెందారు.ఇప్పటి వరకు దేశంలో 1,59,755 మంది కరోనాతో మృతి చెందినట్టు బులెటిన్ ద్వారా తెలుస్తోంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com