టీఆర్ఎస్ నేత గన్‌తో హల్చల్!
- March 21, 2021హైదరాబాద్:తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో.. రెండు స్థానాలను కైవసం చేసుకుంది టీఆర్ఎస్.దీంతో.. టీఆర్ఎస్ శ్రేణులు జోష్‌లోకి వెళ్లిపోయాయి.. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకున్న టీఆర్ఎస్ శ్రేణులు.. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు.. ఈ సంబరాల్లో భాగంగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేత గన్‌తో హల్చల్ చేశాడు. నిన్న ఎమ్మెల్సీ సంబరాల్లో గన్ తెచ్చిన గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్... గాల్లోకి కాల్పులు జరిపేందుకు ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్నవారు ఆపడంతో కట్టెల శ్రీనివాస్ గన్లోపల పెట్టుకున్నాడు. అయితే... దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌కు అసలు ఆ గన్ ఎక్కడిది... ఎవరూ ఇచ్చారు అనేది అందరిలోనూ వస్తున్న ప్రశ్న. అయితే... లైసెన్స్డ్ అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కాగా.. ఇదే సంబరాల్లో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పటాకులు కాలుస్తుండగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.. బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకుంటుండగా.. నిప్పురవ్వలు వెళ్లి పక్కనే ఉన్న ఎండిపోయిన చెట్లపై పడి మంటలు చేలరేగాయి. దీంతో.. అప్రమత్తమైన టీఆర్ఎస్ శ్రేణులు,అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు అగ్నిమాపక సిబ్బంది.కట్టెల శ్రీనివాస్ తీరుపై పార్టీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆయనపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా